శ్రావణ మాసం ఉపవాస దీక్ష.. ఈ ఫుడ్స్‎తో ఆరోగ్యం మీ సొంతం..

02 August 2025

Prudvi Battula 

పొటాషియం, డైటరీ ఫైబర్, విటమిన్ సి, ఫోలేట్ సమృద్ధిగా ఉండే పండ్లు ఉపవాసం ఉన్నప్పుడు తినడానికి ఉత్తమమైనవి.

పాలు, పనీర్, పెరుగు, ఉప్పు లేని వెన్న, మజ్జిగ, లస్సీ వంటి కొన్ని పాల ఉత్పత్తులు ఉపవాస దీక్షలో తీసుకోవచ్చు.

శ్రావణ ఉపవాస కాలంలో బాదం, జీడిపప్పు, పిస్తాపప్పు, వాల్‌నట్ పొడితో మసాలా పాలు తీసుకొంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

సొరకాయతో చేసిన కర్రీ, హల్వా.. ఈ రెండూ ఉపవాసం ఉన్నప్పుడు తినడానికి అనువైనవి. ఇవి ఎంతో రుచికరం కూడా ఉంటాయి.

బంగాళాదుంప.. శ్రావణ మాసం ఉపవాస దీక్ష సమయంలో గొప్ప ఎంపిక. ఇది ఉడికించి తింటే ఆరోగ్యం అంటున్నారు నిపుణులు.

సాబుదానా కిచిడీ, సాబుదానా వడ, సాబుదానా ఖీర్, సాబుదానా పాపడ్, సాబుదానా క్రిస్పీ వంటివి లేకుండా ఉపవాసం పూర్తి కాదు.

శ్రావణ మాసం ఉపవాస సమయంలో తినగలిగే ఏకైక పప్పు దినుస పెసలు. వీటిని వడ పప్పు లేదా మొలకలు రూపంలో తీసుకోవచ్చు.

కుట్టు, రాజ్‌గిరా, సామో, సింఘార వంటి చిరు ధాన్యాలతో చేసిన చపాతీ లేదా పూరీలు శ్రావణ ఉపవాస దీక్షలో తీసుకోవచ్చు.