హరిహరులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో చేసే పూజలు, వ్రతాల వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
కార్తీక మాసంలో సోమవారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కార్తీక సోమవారాల్లో ఉపవాస దీక్షను అనుసరించి శివునికి పూజలు చేస్తారు.
సాయంత్రం వేళ నక్షత్ర దర్శనం తర్వాత దీపాలను వెలిగించి పూజలు చేస్తే సానుకూల శక్తి పెరుగుతుందని అంటారు.
ఇదే మాసంలో అయ్యప్పను హరిహరసుతుడిగా పరిగణిస్తారు. మకర సంక్రమణ సమయంలో స్వామి మకరజ్యోతి రూపంలో ఆవిర్భావిస్తాడని చాలా మంది నమ్ముతారు.
అయ్యప్ప భక్తులు ఆ జ్యోతిని చూసేందుకు మండలం (41 రోజులు) పాటు దీక్షను కొనసాగించి స్వామి సన్నిధికి చేరుకుంటారు.
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజున చేసిన పూజలతో మంచి ఫలితాలు లభిస్తాయి.
ఈ పవిత్రమైన రోజున అత్యంత నియమ నిష్టలతో శివయ్య ఆరాధన చేయాలి. కార్తీక మాసం నియమాలు పాటించే వారు కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవాలి.
ఈ కాలంలో చలి గాలులు విపరీతంగా పెరుగుతాయి. మీ సామర్థ్యం మేరకు పేదలకు, అనాధలకు దుప్పట్లు, ఉన్ని దుస్తులు దానంచేస్తే శివకేశవుల ఆశీస్సులు లభిస్తాయని అంటారు.