సూర్యగ్రహణం రోజున  ఈ తప్పులు చేవద్దు.. లేదంటే జీవితంలో ఈ సమస్యలు తప్పవు

03 March 2025

Pic credit-Pexel

TV9 Telugu

సూర్యగ్రహణం గురించి అనేక నమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి. గ్రహణ సమయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం వలన ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చు. సూర్యగ్రహణం సమయంలో ఈ తప్పులు  చేయవద్దు.

సూర్యగ్రహణం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి 29, 2025న ఏర్పడుతుంది. గ్రహణ సమయం మధ్యాహ్నం 2:20 నుంచి సాయంత్రం 6:13 వరకు ఉంటుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం.

సూర్యగ్రహణం ఎప్పుడంటే 

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ రోజున ఏదైనా కొత్త ఉద్యోగంలో చేరడం, పదోన్నతికి దరఖాస్తు చేసుకోవడం లేదా ఏదైనా పెద్ద వ్యాపార నిర్ణయం తీసుకోవడం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది.

ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు 

గ్రహణం సమయంలో ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో ప్రతికూల శక్తి మీ ఆలోచనలను ప్రభావితం చేస్తుందని నమ్ముతారు.

ప్రతికూల ఆలోచనలు

గ్రహణం సమయంలో ఆహారం తినడం, నీరు తాగడం వంటివి చేయవద్దు. ఎందుకంటే ఈ సమయంలో ప్రతికూల శక్తి ఆహారాన్ని కలుషితం చేస్తుందని నమ్మకం

ఆహారం తినొద్దు 

సూర్యగ్రహణం సమయంలో వేటినీ కత్తిరించవద్దు. గుచ్చడం లేదా గీరడం, కొట్టడం వంటి పనులు చేయవద్దు. సూది దారం ఉపయోగించరాదు. మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలి.

ఏ పనులు చేయవద్దంటే  

సూర్య గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్ళవద్దు. అంతేకాదు  గర్భిణీ స్త్రీలు ఎటువంటి పనులు చేయవద్దు.. తగినంత విశ్రాంతిగా ఉండాలి.   

గర్భిణీ స్త్రీలు 

గ్రహణ సమయంలో మంత్రాలు జపించడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి కెరీర్‌లో విజయావకాశాలు పెరుగుతాయని నమ్ముతారు.

మంత్రాలు జపించండి