11 November 2023
దేశంలో మినీ జపాన్ అని పిలువబడే ఒక నగరం కూడా ఉంది. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఆ నగరానికి ఈ పేరు పెట్టారు.
పటాకుల రాజధానిగా పేరొందిన తమిళనాడులోని శివకాశిని పండిట్ నెహ్రూ మినీ జపాన్ అని పిలిచారు. ఈ పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది.
జపాన్ బాణసంచాకు కూడా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని శివకాశిలో బాణసంచా తయారు చేస్తారు. అందుకే దీనిని మినీ జపాన్ అని పిలుస్తారు.
చెన్నైకి 500 కి.మీ దూరంలో ఉన్న ఈ నగరంలో 400కి పైగా పటాకుల ఫ్యాక్టరీలు ఉన్నాయి. దేశంలో 90% వరకు పటాకులు ఇక్కడి నుంచే సరఫరా అవుతాయి.
పండగలు, పర్వదినాలు ఎంపిక చేసిన సందర్భాల్లో బాణసంచా కాలుస్తారు. కనుక వీటి తయారీ కోసం సంవత్సరంలో 300 రోజులు పని చేస్తారు.
శివకాశిని పటాకుల నగరంగా తీర్చిదిద్దిన ఘనత అయ్యర్ నాడార్, షణ్ముగ నాడార్ అనే ఇద్దరు సోదరులకే దక్కుతుంది. వీరు ఇక్కడ ఫ్యాక్టరీలను స్థాపించారు.
సోదరులిద్దరూ పటాకులు, అగ్గిపుల్లలను తయారు చేయడం నేర్చుకోవడానికి కోల్‌కతా వెళ్లారు. నేర్చుకుని తిరిగి వచ్చిన తర్వాత వారు శివకాశిలో ఫ్యాక్టరీని స్థాపించారు.