27 November 2023
కార్తీక దీపాలు అంటే సాధారణంగా ఒత్తులతో చేసి వెలిగించేవే. అయితే కార్తీక మాసంలో ‘ఉసిరి దీపాలు’లకు విశిష్టత ఉంది.
ఉసిరిని సాక్షాత్తూ విష్ణుస్వరూపంగా భావిస్తారు హిందువులు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద శ్రీమహావిష్ణువు కొలువై ఉంటానని హిందూ ధర్మ శాస్త్రం చెప్తోంది.
ఉసిరికాయ లో దీపం వెలిగించి శివ కేశవులను పూజించిన వారిని చూడడానికి యమునికి కూడా శక్తి చాలదట.
క్షీరాబ్ది ద్వాదశినాడు తులసితో పాటుగా ఉసిరిని కూడా పూజించడం ఉసిరి కాయ మీద వత్తిని వెలిగించడం అత్యంత విశిష్టం.
కార్తీక మాసంలో వచ్చే సోమ, శనివారాలలో శ్రీ మహా విష్ణువుకు ఉసిరి దీపం పెట్టి అభిషేకం చేస్తే అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయట.
వనంలో ఉసిరి చెట్టు నీడన వనభోజనాలు చేస్తే.. పాపాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం. ఈ నెలలో దశమి, ఏకాదశి, పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు.
కార్తీకమాసంలో ఉసిరికాయ ఆవునెయ్యితో దీపం పెడితే నవగ్రహ దోషాలకు పరిహారం కలుగుతుందని పద్మ పురాణంలో పేర్కొన్నారు.
కృష్ణుడు చెప్పడంతో ద్రౌపది గుండ్రంగా ఉసిరికాయ పై భాగం తీసి దానిలో ఆవునెయ్యి, తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేసిందట.
ఉసిరి దీపం వెలిగిస్తే శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, ఈశ్వర అనుగ్రహం లభిస్తుందంటారు. దీనితో సకల ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.