స్వస్తిక్ గుర్తు ప్రాముఖ్యత ఏంటో తెలుసా..?
శుభానికి సంకేతమైన స్వస్తిక్ అంటే సంస్కృతంలో మంచి, అస్తి - కలగటం, మంచిని కలిగించడం.
స్వస్తిక అంటే దిగ్విజయం. ఓంకారం తరువాత హిందూ మతం 'లో అంత ప్రాముఖ్యతను కలిగిన చిహ్నం స్వస్తిక్.
జీవన చక్రాన్ని స్వస్తిక్ సూచిస్తుంది. ఈ గుర్తులో ఉండే నాలుగు గదులు..
స్వర్గం, నరకం, మానవుడు, జంతుజాలాలను సూచిస్తాయని కొన్ని అభిప్రాయాలు..
సాంస్కృతిక,సాంప్రదాయ ఆచారవ్యవహారలలో అతి పురాతనమైనది హిందూ సాంప్రదాయం.
ఈ స్వస్తిక్ ఆకారం సవ్య దిశగా ఉంటుంది. విష్ణువు చేతిలో ఉండే ఈ గుర్తు చెడును నివారించి శుభాలను కలిగిస్తుంది.
అందుకే ఇంటికి,వ్యాపార సంస్థలకు,వాహనాలలో ఈ స్వస్తిక్ ఆకారాన్ని ఎదురుగా నెగిటివ్ ఎనర్జి ఈ స్వస్తిక్ ఉన్న చోట రానివ్వకుండా కాపాడుతుంది.
అందుకే ప్రతీ శుభకార్యలలో ఈ స్వస్తిక్ ఆకారాన్ని వేస్తారు. గృహప్రవేశాలలో, పెళ్ళి వత్రికలలో,వాహన పూజలలో,
నూతన యంత్రాలు వాడే సమయంలో పూజలో ప్రధాన పాత్రను పోషిస్తాయి.
ఇంటి గుమ్మంపై కట్టుకుంటే ద్రుష్టి దోషాల నుండి కాపాడుతుంది అని విశ్వసిస్తారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి