రాత్రి 12 గంటలకు పుట్టినరోజు జరుపుకోకూడదా ?
TV9 Telugu
11 October 2024
ప్రస్తుతం చాలామంది ప్రజలు తరచుగా రాత్రి 12 గంటల సమయంలో తమ పుట్టినరోజు వేడుకను జరుపుకోవడం మొదలుపెడతారు.
వారి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ప్రజలు అర్దరాత్రి 12 గంటలకు పుట్టినరోజు కేక్‌లను కట్ చేస్తారు.
రాత్రి 12 గంటలకు పుట్టినరోజు జరుపుకోకూడదని అంటారు నిపుణులు. ఎందుకు చేయకూడదో అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం
నిజానికి హిందూవులు విశ్వసించే జ్యోతిష్యం ప్రకారం రాత్రి 12 గంటలకు ప్రేత కాలం వస్తుందంటున్నారు నిపుణులు.
అర్దరాత్రి 12 గంటల సమయంలో ప్రతికూల శక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు జ్యోతిష్యవేత్తలు, పండితులు.
దెయ్యం సమయంలో కేక్ కట్ చేయడం వల్ల ఆయుర్దాయం, అదృష్టం తగ్గుతుందని చెబుతున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు.
ఈ సమయంలో పుట్టినరోజు వేడుకను ప్రతికూల శక్తి కారణంగా కూడా అనారోగ్యానికి గురవుతారని జ్యోతిష్యవేత్తల మాట.
అందువల్ల ఈ సమయం పుట్టినరోజు వేడుకలు వంటి ఎలాంటి శుభ సందర్భాన్ని జరుపుకోవడానికి పరిగణించబడదంటున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి