తిరుమల మోకాళ్ళ పర్వతం మోకాళ్లపై ఎక్కాలా.? నిజం ఏంటి.?

18 July 2025

Prudvi Battula 

మోకాళ్ళ పర్వతం అనేది తిరుమలకు వెళ్ళే అలిపిరి కాలిబాటలో ఉన్న ఒక సవాలుతో కూడిన మెట్ల మార్గం. ఇది నిటారుగా పూర్తిగా మెట్లతో ఉంటుంది.

పురాతన కాలంలో ఇప్పట్టి కన్నా విపరీతమైన నిటారుగా ఉండటం వల్ల ఇది యాత్రికులకు కఠినమైన అధిరోహణగా మారింది.

ఈ పర్వతం అధిరోహణ సమయంలో కలిగే తీవ్రమైన నొప్పి కారణంగా  తమ మోకాళ్లను పట్టుకునేవారు. కొండ ఒకప్పుడు ఉన్నంత నిటారుగా ఇప్పుడు లేదు.

భక్తులు అందరు నొప్పి కారణంగా మోకాళ్ల పట్టుకొని ఎక్కడం వల్ల దీనికి "మోకళ్ల పర్వతం" అని పేరు వచ్చింది. ఇదే అసలు కారణం.

భారతీయ హిందూ తత్వవేత్త, గురువు, సామాజిక సంస్కర్త శ్రీ రామానుజాచార్యులు తిరుమల కొండను మోకాళ్లపై ఎక్కారని చెబుతారు.

శ్రీ రామానుజాచార్యులు తన పాదాలు కొండను తాకకుండా చూసుకోవాలనుకున్నారు. ఎందుకంటే ఇది "సాలగ్రామం" (పవిత్ర రాయి)లాగా పవిత్రంగా పరిగణించబడుతుంది.

భక్తి, గౌరవంతో, అతను తన మోకాళ్ళను ఉపయోగించి కొండ ఎక్కాడు. నేటికీ, కొంతమంది భక్తులు తమ విశ్వాసానికి నిదర్శనంగా మోకాళ్లపై కనీసం కొన్ని మెట్లు ఎక్కుతున్నారు.

రామానుజాచార్యులు తిరుమల ఏడు కొండలను పవిత్రమైనవిగా భావించి మొత్తం మెట్లను మోకాళ్లపై ఎక్కారు. కానీ చాలామంది మోకళ్ల పర్వతం మోకాళ్లపై ఎక్కుతూ ఉంటారు.