రోజుకు ఐదు సార్లు రంగులు మారే శివలింగం.. అబ్బా మహా అద్భుతం

Phani CH

23 Jul 2025

Credit: Instagram

మన దేశం లో 12 జ్యోతిర్లింగ ఆలయాలతో పాటు వివిధ ప్రాంతాలలో అద్భుత శైవ క్షేత్రాలు ఉన్నాయి. ఇలాంటి వాటి లో  కళ్యాణసుందరేశ్వర ఆలయం ఒకటి.

ఇది తమిళనాడులోని కుంభకోణంలో ఉంది. ఈ దేవాలయానికి సంబంధించిన అనేక అద్భుతమైన కథలు వాడుకలో ఉన్నాయి.

ఈ ఆలయం శివుడు నివాసం అని నమ్ముతారు ప్రజలు. అంతేకాదు ఈ ఆలయం ప్రత్యేకమైన శిల్పాలు, శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. 

ఈ ఆలయం శివుడిని కళ్యాణసుందరేశ్వర స్వామిగా మరియు పార్వతిని కళ్యాణి అమ్మన్‌గా పూజిస్తుంది. ఇక్కడ శివలింగం స్వయంభు  వెలసినది.

ఈ ఆలయం యొక్క స్వయంభూ శివలింగంప్రత్యేకత ఏంటంటే ఇది రోజుకు ఐదుసార్లు రంగులు మారుతుందని భక్తులు నమ్ముతారు.

ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 3 గంటలకు, రాత్రి 8 గంటలకు మరియు అర్ధరాత్రి 12 గంటలకు రంగులు మారుతుందని భక్తులు చెబుతున్నారు.

సాధారణంగా, శివలింగం తెల్లగా, బంగారు వర్ణంలో, ఎరుపు, ఆకుపచ్చ మరియు నీలం రంగులలో మారుతుందని చెబుతారు.