నవరాత్రుల్లో 9 రోజుల్లో అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలంటే  

15 October 2023

నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రిగా అమ్మవారు పూజలాలను అందుకుంటారు. ఆవు నెయ్యి సమర్పించండి. కట్టు పొంగలి నివేదించండి

కట్టు పొంగలి

రెండవ రోజు బ్రహ్మచారిణి రోజు. అమ్మవారిని పూజించిన తరువాత పంచదారతో చేసిన ఆహారం, పులిహోర సమర్పించండి.

పులిహోర

నవరాత్రుల మూడవ రోజున చంద్రఘంట తల్లిని పూజిస్తారు. తల్లికి కొబ్బరి అన్నం, పాలు, స్వీట్లు లేదా ఖీర్ అందించండి

కొబ్బరి అన్నం

నాల్గవ రోజున తల్లి కూష్మాండను పూజిస్తారు. ఈ రోజున అమ్మవారికి చిల్లులు పెట్టని అల్లం గారెలను సమర్పించండి

అల్లం గారెలు

స్కందమాతను ఆరాధించడం వల్ల మోక్షం లభిస్తుంది. అమ్మవారికి అరటిపండు సమర్పించండి. దద్దోజనం సమర్పించండి.

దద్దోజనం

తల్లి కాత్యాని పులిపై స్వారీ చేస్తుంది. ఈ మాతృమూర్తికి తేనెను సమర్పించండి. కేసరి అన్నం నివేదించండి

కేసరి అన్నం

ఏడవ రోజు కాళరాత్రిగా పరిగణించబడుతుంది. అమ్మవారిని పూజించిన తరువాత బెల్లం సమర్పించండి. శాఖాన్నం నివేదించండి 

శాఖాన్నం

ఎనిమిదవ రోజు మహాగౌరికి కొబ్బరికాయ సమర్పించండి. చక్కెర పొంగలి నివేదించండి

చక్కెర పొంగలి

తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రికి నువ్వులు సమర్పించండి. పాయసాన్నం నివేదించండి

పాయసాన్నం