శ్రీ మహాలక్ష్మీ స్వయంగా తపస్సు చేసిన ప్రాంతం.. శక్తి పీఠాల్లో ఒకటి
04 November 2023
వైకుంఠంలో వున్న అమ్మవారు భక్తుల కోసం భూమిపై వెలసిన క్షేత్రమే మహారాష్ట్ర కొల్హాపూర్‌లోని శ్రీ మహాలక్ష్మీ ఆలయం.
మహాలక్ష్మి అమ్మవారు కోలహాసురుడును సంహరించి ఇక్కడ వెలసిందని అందుకే కొల్హాపూర్ అనే పేరు వచ్చిందని కొందరు చెబుతారు.
పద్మావతి పరిణయం వేళ తిరుమలేశుడు పై అలిగిన అమ్మవారు ఇక్కడకు వచ్చి వెలిసిందని మరికొందరు అంటుంటారు.
శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహాన్ని అరుదైన శిలపై చెక్కారు. నాలుగు హస్తాలు కలిగి భక్తులను దీవిస్తున్న రూపం భక్తులను ఆకట్టుకుంటుంది.
సకల సంపదలకు నిలయం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు. నిత్యం వేలాది మంది భక్తులు ఆమెను దర్శించుకొని కరుణ తమపై ప్రసరించాలని పూజలు చేస్తుంటారు.
సతీదేవి నయనాలు పడినట్లు పురాణాల కథనం. ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
మహాలక్ష్మి దేవి మూల విరాట్ పై ఫిబ్రవరి, నవంబర్ నెలల్లో సూర్య కిరణాలు నేరుగా ప్రసరించడం విశేషం. దీనిని కిరణోత్సవం అంటారు.
ఇక్కడ అమ్మవారిని అంబబాయి అని కరివీర్ మహాలక్ష్మి అనే పేరులతో పిలుస్తారు. చైత్ర పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది.
లోకమాత జగదాంబ ఈ క్షేత్రాన్ని సృష్టించడమే కాదు ఒక్క రాత్రిలోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. గర్భగుడిలో మహాలక్ష్మి అమ్మవారు విగ్రహం కుర్చొని ఉన్న స్థితిలో ఉంటుంది.