ఈ శక్తిపీఠానికి వెళ్లాలంటే మానవ సంకల్పం ఉంటే చాలదు.. దైవ కృప కూడా ఉండాలట

27 August 2023

సతీదేవి శరీర భాగాలు భూమిపై పడిన 51 ప్రదేశాల్లో 18 అష్టాదశ శక్తి పీఠాలుగా ప్రసిద్ధి. శివయ్యను దర్శించిన పిమ్మటే శక్తి పీఠం దర్శన ఫలితం సిద్ధించునని నమ్మకం

సతీదేవి ఖండిత శరీరభాగాల్లో వీపుభాగం పడిన శక్తిపీఠంగా 18 శక్తిపీఠముల్లో 2వ శక్తిపీఠంగా కాంచీపురం కామాక్షిపీఠం ప్రసిద్ధి.

గరుడపురాణం నందు ఏడు పుణ్యక్షేత్రాలు మోక్షస్థలని పేర్కొంది. అవి అయోధ్య, మధుర, హరిద్వార్, వారణాశి, అవంతిక, ద్వారక, కాంచీపురం

తమిళనాడులోని కాంచీపురంలో హిందువులు పవిత్రంగా పూజించే కామాక్షీదేవి అలయం ఉంది. లలితాపరమేశ్వరిదేవి, పార్వతీదేవి రూపంగా విశ్వాసం

8వ శతాబ్దంలో జగ్దద్గురు ఆది శంకరాచార్యులు శ్రీచక్రము నెలకొల్పిన కామాక్షీదేవి అలయాన్ని కాంచిపురం ముఖ్యపట్టణంగా పాలించిన పల్లవరాజులు నిర్మించారు

కామాక్షీదేవి ఆలయంలో పాశం, అంకుశం, చెరకుగడ, భుజంపై చిలుకతో పద్మాసన స్థితలో కొలువుండే కామాక్షిదేవిని పూజిస్తే సకల సిరిసంపదలూ కలుగుతాయని ప్రతీతి

స్థలపురాణం ప్రకారం మహిషాసురుణ్ని సంహరించిన చాముండేశ్వరీదేవి పాప నివారణ కోసం కంచిలో తొలిసారి అడుగు పెట్టినచోట ఆదిపీఠ పరమేశ్వరిగా కొలుస్తారు భక్తులు

దేవి ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి అర్చించి ఆపుణ్యంతో కామాక్షిదేవిగా అవతరించి శివుణ్ని వివాహం చేసుకుందని ప్రతీతి

ఈ నేపథ్యంలో ఆదిపీఠ పరమేశ్వరి ఆలయాన్ని ఆదిపరాశక్తి యోగపీఠంగా కామాక్షీదేవి ఆలయాన్ని భోగపీఠంగా భావిస్తారు భక్తులు

దేవి నాలుగు చేతుల్లో క్రింద రెండింటిలో చెరకుగెడ, అయిదుపూవులగుత్తి, పై రెండు చేతుల్లో శంఖం, పాశం కలిగి ఉంటుంది