శ్రీరామ నవమి రోజున భద్రాద్రి రామయ్య కల్యాణం.. బుక్ చేసుకోండిలా!

TV9 Telugu

31 March 2024

ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో ఏప్రిల్ 17న శ్రీరామ నవమిని పురస్కరించుకుని కల్యాణం నిర్వహించనున్నారు.

రాములోరి కల్యాణాన్ని కనులారా వీక్షించాలనుకునే భక్తుల కోసం మార్చి 25 నుంచి సెక్టార్ టికెట్లను దేవస్థానం అందుబాటులోకి ఉంచింది.

శ్రీరామ నవమి రోజున ఉభయ దాతల టికెట్ రుసుమును రూ. 7,500గా తెలిపింది. ఈ టికెట్ ద్వారా ఇద్దరికి ప్రవేశం ఉంటుంది.

అలాగే, రూ. 2500, రూ. 2000, రూ. 1000, రూ. 300, రూ. 150 టికెట్లను కూడా అందుబాటులో ఉంచింది. ఈ టికెట్లపై ఒక్కరికి మాత్రమే ప్రవేశం ఉంటుంది.

ఏప్రిల్‌ 18న పట్టాభిషేకం టికెట్లను ప్రకటించింది. అన్ని టికెట్లను https://bhadradritemple.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.

ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారు ఏప్రిల్ 1 నుంచి 17 వరకు తానీషా కల్యాణ మండపంలో ఒరిజినల్ ఐడీ కార్డులు చూపించి టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది.

నేరుగా టికెట్లు కొనుగోలు చేయాలనుకున్న వారు ఏప్రిల్ 1 నుంచి భద్రాచలం రామాలయం ప్రత్యేక కౌంటర్లలో నేరుగా కొనుగోలు చేయవచ్చు.

ఇంకెందుకు ఆలస్యం మీరు సీతారాముల కళ్యాణం కన్నులారా వీక్షించాలంటే లేట్ చేయకుండా వెంటనే సెక్టార్ టికెట్స్ బుక్ చేసుకోండి.