నిద్రపోయే ముందు కాళ్ళు కడుక్కొనే సంప్రదాయం.. సైన్స్ ఏమంటుందంటే..
TV9 Telugu
07 August 2024
హిందూ సంప్రదాయం ప్రకారం.. పగలు కష్టపడి రాత్రి అలసిపోయిన తర్వాత శరీరం విశ్రాంతి తీసుకునే ముందు కాళ్ళు కడుక్కొని నిద్రపోవాలంటారు.
పాదాలు కడుక్కోకుండా నిద్రపోవడం వల్ల శరీరంలో శక్తి సక్రమంగా ప్రసారం కాదనేది శాస్త్రోక్తి. ఇది చాలమందికి తెలియని విషయం.
శరీరంలో అనేక శక్తి చక్రాలు ఉంటాయి. నిద్రలో ఈ చక్రాలన్నీ మూసుకుపోతాయి. నీరు శరీరానికి శక్తినిచ్చే అనేక విద్యుదయస్కాంత లక్షణాలను కలిగి ఉంటాయి.
నీటితో పాదాలను శుభ్రరపచుకుని నిద్రించడం వల్ల శరీర చక్రాలను నియంత్రించవచ్చని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి.
నీరు శరీరం శక్తి స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మానసిక భావోద్వేగాలను నియంత్రించడంలో తోడ్పడుతుంది.
సైన్స్ ప్రకారం..బాడీ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. బ్యాక్టీరియా మొదట పాదాలకు అంటుకుని మొత్తం శరీరంలోకి ప్రవేశిస్తుంది.
అందువల్ల, పడుకునే ముందు శరీరంలోకి ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేదా బ్యాక్టీరియా ప్రవేశించకుండా ఉండటానికి పాదాలను నీటితో శుభ్రం చేసుకోవాలి.
పాదాలను నీటితో శుభ్రం చేస్తే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు. శరీరంలో అలసట, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి