దేవాలయాలలో తప్పక పాటించాల్సిన నియమాలు.

కాళ్ళూ చేతులు శుభ్రం చేసుకోకుండా ఆలయంలోకి ప్రవేశించరాదు.

ఆలయ పరిసరాల్లో మల, మూత్ర విసర్జన చేయకూడదు.

ఆలయం లోవల ప్రశాంతంగా ఉండాలి. ఎవరితో గొడవ పెట్టుకోకూడదు.

నీవు దరించె వస్త్రాల వలన ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకూడదు.

ఆలయంలోకి వెళ్ళినప్పుడు బట్టలు శుభ్రంగా ఉండాలి.

తలస్నానం చేసిన తర్వాత గుడికి వెళ్ళాలి.

స్త్రీలు పట్టు వస్త్రాలు ధరించి ఆలయంలో ఉన్న గర్భగుడిలో ప్రవేశించరాదు.

ఆలయంలో ఉన్న గర్భగుడిలో ప్రదక్షిణ చేయరాదు.

ఆలయంలో దేవునికి తప్ప ఎవరికీ నమస్కారం పెట్టకుడదు.

దేవుని దర్శనం తర్వాత ఆలయ ప్రాంగణంలో కొంతసేపు కూర్చుని వెళ్లాలి.

ఆలయంలోనికి వెళ్ళేటప్పుడు కుంకుమ /తిలకం ధరించి వెళ్ళాలి.

ఆలయంలో గోళ్ళు కొరుకుట చేయకూడదు.