రాఖి కట్టడానికి ఇదే అనువైన సమయం.. 

TV9 Telugu

13 August 2024

రక్షా బంధన్ సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు చిహ్నంగా చెబుతారు.ఈ రోజున సోదరునికి రాఖి కట్టి ఎంతో మురిసిపోతుంది సోదరి.

రాఖి పండగ ఎందుకు చేస్తారు అంటే తన సోదరుడు ఎక్కడ ఉన్న క్షమాంగా ఉండాలి కోరుకొంటూ సోదరి కట్టే రక్ష అనే ఈ పండగ ఉద్దేశం.

అలాగే సోదరుడు కూడా తన సోదరి చెంతకి కష్టాన్ని రాకుండా సమస్యకి అడ్డం నిలిబడి ఉంటానని హామీ ఇవ్వడమే రక్ష బంధన్.

ఈ ఏడాది రక్ష బంధన్ ఆగష్టు 19న జరుపుకోనున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, శ్రావణ మాసంలో పూర్ణిమ తిథి రోజున జరుగుతుంది.

ఈ ఏడాది రక్ష బంధన్ ఉదయం 3:04 గంటలకు ప్రారంభమై అదే రోజు రాత్రి 11:55 గంటలకు ముగుస్తుందని పండితులు చెబుతున్నారు.

అయితే ఉదయం 5:53 నుండి మధ్యాహ్నం 1:32 వరకు భద్ర కాలం ఉండనుంది. ఈ సమయంలో సోదరినికి రాఖీ కట్టకూడదని శాస్త్రం చెబుతుంది.

మళ్లీ మధ్యాహ్నం 1:32 నుండి రాత్రి 9:08 వరకు రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం. ఈ ఏడాది రక్షా బంధన్ ముహూర్తం 7 గంటలకు పైగా ఉండనుంది.

ఈసారి అన్ని కార్యక్రమాలలో విజయాన్ని అందించే సర్వార్థ సిద్ధి యోగం కూడా రక్షా బంధన్ నాడు ఏర్పడింది. ఇది ఉదయం 5:53 నుండి 8:10 వరకు ఉంటుంది.