వినాయక చవితి రోజున చంద్రుడిని చూస్తే చెయ్యాల్సిన పరిహారం.. 

TV9 Telugu

27 August 2024

మహాశివుడు భాద్రపద శుద్ధ చవితినాడే వినాయకుడుకి విఘ్నాధిపత్యం ఇస్తాడు. అప్పటి నుంచి విఘ్నాలకు అధిపతి అయ్యాడు విగ్నేశ్వరుడు.

దీంతో అందరు గణపతికి కుడుములు, ఉండ్రాళ్లు, మొదలైనవన్నీ సమర్పించి పూజిస్తారు. వాటిని కడుపు నిండా తిని మూషిక వాహనంపై సంధ్య వేళకు కైలాసానికి వెళ్తాడు.

అక్కడ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిద్దాం అంటే పొట్ట నిండుగా ఉన్నందున పాదాలను అదుకోలేక ఇబ్బంది పడుతున్నా వినాయకుడిని చూసి చంద్రుడు హేళనగా నవ్వుతాడు.

చంద్రుడి దృష్టిసోకి గణనాధుడు ఉదరం పగిలి మరణించడంతో ఆగ్రహానికి గురైన పార్వతి "నిన్ను చూసినవారంతా నీలాపనిందలు పొందుదురుగాక" అని చంద్రుడిని శపిస్తుంది.

బ్రహ్మ గణపతిని బతికించిన తర్వాత దేవతలంతా శాపాన్ని ఉపసంహరించుకోమని పార్వతీని కోరగా "వినాయక చవితినాడు చంద్రుడిని చూసిన వారు మాత్రమే.." అంటూ శాప తీవ్రతను తగ్గిస్తుంది.

అప్పటినుంచి చంద్రుడిని చూసిన వారంతా నిందలు పడాల్సి వస్తుంది. సాక్షాత్తూ శ్రీకృష్ణుడుపై కూడా శమంతకమణిని అపహరించాడనే నింద పడిదింది.

వినాయక చవితి రోజున అనుకోకుండా చంద్రుడిని చూస్తే ముందుగా గణపతిని పూజించి, పూలు, పండ్లు సమర్పించి చంద్రుడికి చూపించి పేదవారికి దానం ఇవ్వాలి.

అదే సమయంలో "సింహః ప్రసేన మవధీః సింహా జాంబవకా హతః సుకుమార మారోదీః తవ హ్యేష స్యమంతకః" అనే.. మంత్రాన్ని పఠించి గణపతి పాదాల దగ్గర అక్షతలను తలపై వేసుకోవాలి.