10 December 2023
కార్తీకమాసం చివరి సోమవారం కాల సర్ప దోషం నుంచి విముక్తి కి కొన్ని పరిహారాలను జ్యోతిష్కులు సూచించారు. సాయంత్రం చేసే పూజలతో దోషం నివారణ అవుతుంది.
జాతకంలో కాలసర్ప దోషం ఉంటే తరచుగా ఆరోగ్య, ఉద్యోగ సమస్యలతో పాటు వ్యాపారంలో నష్టాలు, మానసిక ఒత్తిడి, ఆందోళనలు ఏర్పడతాయి.
వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతున్నా.. ఆర్థిక, శారీరక సమస్యలతో ఎల్లప్పుడూ ఇబ్బందులు పడుతున్నా కార్తీకమాసం చివరి సోమవారం పూజ ఫలవంతం
నాగ దోషం అనేది జాతకాన్ని బట్టి మారుతూ ఉంటుంది. జాతకంలో రాజయోగం ఉంటే వారిపై కాల సర్ప దోషం ప్రభావం తక్కువగా ఉంటుంది.
దోష నివారణకు శ్రీ కాళహస్తి ఆలయంలో రాహు, కేతువులకు లేదా నాసిక్ లోని త్రయంబకేశ్వర ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేయడం శుభఫలితాలను ఇస్తుంది.
సోమవారం సాయంత్రం కాల సర్ప దోష విముక్తికి మహా మృత్యుంజయ మంత్రం, శ్రీ విష్ణు పంచాక్షరి మంత్రాలను పఠించాలి.
కృష్ణుడి ఫోటోని పూజిస్తూ ‘ఓం నమో భగవతే వాసు దేవాయ’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం నాగ దోషం నుంచి నివారణ లభిస్తుంది
కార్తీక మాసంలో వచ్చే చివరి సోమవారం రోజున పరమేశ్వరునికి రుద్రాభిషేకం, నాగదేవతలను పూజించడం వల్ల ఈ దోషం తొలగిపోతుందని పండితులు చెబుతారు.