ఇంటిముందు ముగ్గులు వేయడం వెనుక రహస్యం ఇదే..

23 August 2023

ముగ్గు అంటే భూమిని అలంకరించడం .. సుందరంగా అలంకరించిన భూమాతను చూడడం వలన కొన్ని పీడలు  నివారింపబడతాయి.

ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. మన పూర్వీకులు కళ్ళాపు వాకిళ్ళు ముగ్గులు ఎందుకు పెట్టేవారు వాటి వెనుక రీజన్ ఏమిటో చూద్దాం.

ముగ్గుల్లో అనేక రకాలున్నాయి. ఇంటి ముందు రెండు అడ్డగీతలు ముగ్గుని పెడితే దుష్టశక్తులను రాకుండా నిరోధి స్తాయని, లక్ష్మీదేవి బయటకు వెళ్ళ కుండా చూస్తాయని నమ్మకం.

ఒక ముగ్గు పెట్టి… దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభ కార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు.

నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో ముగ్గు వేస్తే.. భూత, ప్రేత, పిశాచాలు ఇంట్లోకి రాకుండా చూస్తుందని నమ్మకం.

ఇంటి ముందు పద్మ ముగ్గు , చుక్కల ముగ్గులలో అనేక రహస్యాలు ఉన్నాయి. అవి కేవలం గీతాలు మాత్రమే కాదు.. యంత్రాలు కూడా. అందుకనే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.

గుడిలోనూ, అమ్మవారు, శ్రీ మహావిష్ణువు ముందు రొజూ ముగ్గు పెట్టె స్త్రీకి వైద్యవ్యం రాదని.. సుమంగళిగానే మరణిస్తుందని దేవీ భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.

నిత్యం ఇంటి ముందు,  వెనుక భాగంలో, తులసి వేసే ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను  ఇంట్లోకి ఆకర్షిస్తుంది.