తెరుచుకున్న రామాలయం.. 21 ఏళ్ల నిరీక్షణకు తెర

09 April 2024

TV9 Telugu

ఛత్తీస్‌గఢ్‌లో 21 ఏళ్లుగా మూతపడిన రామమందిరం తలుపులు తెరుచుకున్నాయి. ఈ ఆలయాన్ని నక్సలైట్లు మూసివేశారు.

21 ఏళ్ల తర్వాత రామాలయం ఓపెన్ 

సుక్మా జిల్లాలోని చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేరళపెండ గ్రామంలో ఉన్న ఈ పురాతన దేవాలయం తలుపులను 2003లో నక్సలైట్లు మూసివేశారు.

2003లో మూసివేత 

నక్సలైట్ల భయంతో ఒక్క కుటుంబం తప్ప గ్రామస్థులెవరూ గుడికి వెళ్లలేదు. కుటుంబ సభ్యులు రహస్యంగా గుడికి వెళ్లి దేవుడికి పూజలు చేసేవారు.

 భయంతో గుడికి వెళ్ళని భక్తులు 

ఆలయ సమీపంలోని లఖపాల్‌లో భద్రతా బలగాలు కొత్త క్యాంపును తెరిచాయి. అనంతరం సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికి చేరుకుని గ్రామస్తుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

బలగాలు కొత్త క్యాంపు

గ్రామస్తులు తమ రామయ్య ఆలయ పరిస్థితి గురించి చెప్పారు. అంతేకాదు తిరిగి తాము పూజలు చేసుకుంటామని సైనికులకు చెప్పి తెరవమని అభ్యర్థించారు.

ఆలయాన్ని తెరవాలని విజ్ఞప్తి

గ్రామస్థుల అభ్యర్థన మేరకు  CRPF 74వ బెటాలియన్ సైనికులు రామాలయం తలుపులు తెరిచి శుభ్రం చేశారు .

తలుపులు తెరిచిన జవాన్లు 

ఆలయం తెరవగానే గ్రామస్తుల్లో ఆనందం వెల్లివిరిసింది. అందరూ కలిసి ఆలయాన్ని శుభ్రం చేశారు. గుడిలో రాముడు, సీత, లక్ష్మణుల విగ్రహాలకు పూజలు చేశారు.

గ్రామస్తుల్లో ఆనందం

ఈ ఆలయం దాదాపు 5 దశాబ్దాల నాటిది. రాముడు, సీత , లక్ష్మణుల పాలరాతి విగ్రహాలను దర్శించుకున్న భక్తులు ఆనందంతో నృత్యం చేశారు. ఆలయాభివృద్ధి చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఆనందంతో నృత్యం