13 June 2024
TV9 Telugu
రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలోని శివగంజ్‌లో రామ్‌లాలా కోసం ప్రత్యేక బహుమతులు సిద్ధం చేశారు. వీటిలో భారీ గద, పెద్ద రామ ధనస్సులు ఉన్నాయి
ఇక్కడి కళాకారులు చాలా నెలలుగా ఈ భారీ గదను, రామ ధనుస్సును తయారు చేయడంలో నిరంతరం శ్రమించారు. ఇప్పుడు శ్రమకు తగిన ఫలితంగా వీటికి తుది రూపం ఇచ్చారు.
దాదాపు 1600 కిలోల బరువున్న హనుమంతుడి గదును ఇక్కడ తయారు చేశారు. దీనిని ఒక చోటు నుంచి మరో చోటికి తరలించేందుకు ఉపయోగిస్తున్నారు.
1100 కిలోల రామ ధనస్సుని కూడా హనుమంతుని గదలానే తయారు చేశారు. ఈ రెండు ప్రత్యేక బహుమతులు బాల రామయ్య పాదాల వద్ద సమర్పించడానికి పంపిస్తున్నారు.
ఈ బహుమతులను అయోధ్యలో శ్రీరాముని పాదాల వద్ద సమర్పించనున్నారు. దీనికి సంబంధించి రామరథ యాత్రను నగరంలోని మహారాజా మైదానం నుంచి జెండా ఊపి అయోధ్యకు పంపారు
బాల రామయ్య కోసం ఈ ప్రత్యేక బహుమతులను సనాతన్ సేవా సంస్థాన్, శివగంజ్ వారు అందించారు. జూన్ 12న రామరథ్‌లో బయలుదేరిన ఈ ప్రత్యేక బహుమతులు జూన్ 16న అయోధ్యకు చేరుకుంటాయి.
బాల రామయ్య కి సమర్పించనున్న ఈ హనుమాన్ గద, రామ ధనుస్సు పంచధాతువులను ఉపయోగించి తయారు చేశారు. వీటిని జూన్ 17న ప్రత్యేక పూజలు చేసి రామ్ లల్లాకు సమర్పించనున్నారు.