ఈ పువ్వులతో పొరపాటున కూడా దేవుళ్లను పూజించవద్దు..  

01 April 2024

TV9 Telugu

Pic credit - Pexels

హిందువులు ఇంట్లో పూజ గదిని ఏర్పాటు చేసుకుని రోజూ దేవుళ్లను పూజిస్తారు. రకరకాల పువ్వులతో దేవుళ్ళకు సమర్పిస్తారు. 

రకరకాల పువ్వులతో

ప్ర‌తి రోజు కొందరు ఇంట్లోనే పూజ‌లు చేస్తే మ‌రికొంద‌రు ఆలయాలకు వెళ్లి పూజ‌లు నిర్వహిస్తుంటారు. పువ్వులేని పూజ చేయడం బహు అరుదు. 

పువ్వులేని పూజ

జ్యోతిష్యం ప్రకారం కొన్ని రకాల దేవుళ్ళకు కొన్ని రకాల పువ్వులను సమర్పించరాదు. అలాంటి పువ్వులను  స‌మ‌ర్పిస్తే  ఆగ్ర‌హానికి గురవుతారని న‌మ్మ‌కం.  

కొన్ని రకాల పువ్వులు

సృష్టి లయకారుడు శివుడికి మొగలి పువ్వుని స‌మ‌ర్పించ‌కూడ‌ద‌ట‌. మొగలి పువ్వుతో పూజ చేస్తే శివుడికి కోపం వస్తుందట.   

శివుడు 

శ్రీరాముడికి గ‌న్నేరు పువ్వుల‌తో పూజ చేయరాదు. గన్నేరు పువ్వులతో రామయ్యని పూజిస్తే భక్తులు కోరిన కోర్కెలు నెరవేరవట.  

 శ్రీ రాముడు

శ్రీ మహా విష్ణువును పూజించే సమయంలో కొన్ని పూలకు దూరంగా ఉండడం మంచిదట. మహావిష్ణువును పూజించే సమయంలో అగస్త్య పుష్పాలు ఉపయోగించవద్దు అని శాస్త్రాలు పేర్కొన్నాయి. 

శ్రీ మహా విష్ణువు 

దుర్గాదేవికి కింద పడిన పువ్వులతో, ఘాటైన వాస‌న క‌లిగిన పువ్వులతో పూజ చేయకూడదట. ఇటువంటి పువ్వులు దుర్గాదేవికి అప్రియమైనవట.

దుర్గాదేవి

ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు బిల్వ పత్రాన్ని సమర్పించకూడదట. ఇలా చేయడం వలన సూర్యుడికి ఆగ్రహం కలుగుతుందట.  

సూర్య భగవానుడు  

జిల్లేడు, ఉమ్మెత్త పువ్వులతో పార్వతి దేవికి పూజ చేయకూడదట. శివయ్యకు ఇష్టమైనా పార్వతీ దేవిని పూజించేటప్పుడు ఈ పూలను సమర్పించవద్దు అని పండితులు చెబుతున్నారు. 

పార్వతీదేవి