నటరత్నాలు ట్రైలర్ రిలీజ్.. విడుదలైన హ్యాపీ ఎండింగ్ ట్రైలర్..
TV9 Telugu
22 January 2024
అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. యావత్‌దేశం వేచిచూసిన సుదీర్ఘ స్వప్నం సాకారమైంది. ఎన్నో శతాబ్ధాల కల నెరవేరింది.
వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య అయోధ్య గర్భగుడిలో మధ్యామ్నం 12.29 గంటలకు రామ్‌లలాకు ప్రాణ ప్రతిష్ఠ కత్రువు పూర్తి చేశారు.
అభిజిత్ లగ్నంలో ప్రధాని మోదీ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మొత్తం 84 సెకన్ల పాటు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కొనసాగింది.
అనంతరం ప్రధాని మోదీ బాల రాముడి పాదాలపై పూలువేసి నమ్రతతో నమస్కరించారు. ముందుగా ప్రత్యేక పూజలు చేశారు.
అంతకుముందు అయోధ్య ఆలయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..స్వామివారికి పట్టువస్త్రాలు, ఛత్రం సమర్పించారు.
ప్రాణ ప్రతిష్ఠ క్రతువుల్లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ పాల్గొన్నారు.
జగమంతా సంబరంలా.. భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
అయోధ్యలో బాల రాముడి వైభవాన్ని దేశ, విదేశాల్లోని ప్రజలు, రామభక్తులంతా లైవ్‌లో కన్నులారా వీక్షించి తరించారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి