మూడవ రోజు గణపతి నిమజ్జనానికి సరైన సమయం ఇదే..

09 September 2024

Battula Prudvi 

దేశ వ్యాప్తంగా శనివారం ప్రతీ గల్లీ, వాడ, కాలనీలలో గణపతిని ప్రతిష్టాపించి వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా భక్తులు గణపతికి ఇష్టమైన ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించి తమ కోరికలు తీర్చమంటూ కోరుకుంటున్నారు.

గణపతిని 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు నిమజ్జనం చేస్తుంటారు.  మేలాలు, డీజేలు, బాజా భజంత్రీలతో గణపతి నిమజ్జనం చేస్తారు.

అయితే మూడవ రోజున గణేశుడిని నిమజ్జనంనికి శుభ సమయం ఏంటో చూద్దాం. నిమర్జనం చేయడానికి 4 శుభ ముహూర్తాలు ఉన్నాయి.

సెప్టెంబర్ 9వ తేదీ అంటే మూడవరోజు గణేషుడి నిమర్జనానికి మొదటి శుభ ముహూర్తం ఉదయం 6:03 నుండి 7:37 వరకు ఉంది.

అలాగే రెండవ శుభ ముహూర్తం విషయానికి వస్తే ఇది ఉదయం 9:11 నుండి 10:44 వరకు గణేషుడిని నిమజ్జనం చేయవచ్చు.

మూడవరోజు విఘ్నేశ్వరుడి నిమజ్జననికి మధ్యాహ్నం 1:52 నుంచి సాయంత్రం 7:59 వరకు మూడవ శుభ ముహూర్తంగా చెబుతున్నారు పండితులు.

నాల్గవ శుభ సమయం విషయానికి వస్తే రాత్రి 10:52 నుండి అర్ధరాత్రి 12:18 వరకు ఉండనుందని పండితులు చెబుతున్నారు.