గ్రహదోష నివారణకు ఏడువారాల నగలు.. ఏ రోజు ఎలాంటివి ధరించాలంటే.?
07 July 2025
Prudvi Battula
పూర్వకాలంలో మహిళలు 'ఏడు వరల నాగలు' ధరించేవారు. ఇవి వారంలోని ప్రతిరోజు ఒక నిర్దిష్ట రత్నం, లోహంతో తయారైన నగలు.
ఆదివారం: తొలిరోజు ఆదివారం సూర్యభగవానుడికి ఇష్టమైన రోజు. కనుక ఈ రోజున కెంపు (మాణిక్యం)తో చేసిన నగలను ధరించడం వల్ల గ్రహ దోషాలు పోతాయి.
సోమవారం: చంద్రుడికి ఇష్టమైన రోజు సోమవారం. ఈ రోజున చల్లదనం వెదజల్లేలా.. ముత్యాలతో తయారుచేయబడిన నగలను ధరిస్తే శుభప్రదం.
మంగళవారం: కుజుడికి సంబంధించిన రోజు మంగళవారం. ఆ రోజున పగడాలతో చేసిన హారం, గాజులు, ఉంగరాలు వంటి నగలు పెట్టుకునేవారు.
బుధవారం: బుధునికి ఇష్టమైన రోజు బుధవారం. ఈ రోజున పచ్చని పచ్చ లాకెట్లు, పచ్చని పచ్చ బ్యాంగిల్స్‌తో చేసిన హారాలు ధరిస్తే శుభప్రదం.
గురువారం: దేవతల గురువు బృహస్పతిని సూచించే గురువారం పుష్పరాగంతో చేసిన నగలు ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయని పండితులు అంటున్నారు.
శుక్రవారం: శుక్రుడికి ఇష్టమైనది శుక్రవారం. ఆ రోజు లక్ష్మీదేవికి నచ్చిన వజ్రాలతో చేసిన నగలను ధరించడం వల్ల మహిళలకు మంచి జరుగుతుందని నమ్మకం.
శనివారం: శనీశ్వరుడికి ఇష్టమైన రోజు శనివారం. కనుక ఈరోజున నీలమణితో తాయారు చేయబడిన చేసిన నగలు ధరించడం శుభప్రదం.
మరిన్ని వెబ్ స్టోరీస్
విమానంలో ఏ సీటు సురక్షితమైనదో మీకు తెలుసా?
అంతరిక్షంలో అత్యధిక సాటిలైట్లను కలిగిన దేశాలు ఇవే..
పురాణాల ప్రకారం.. అష్టదిక్పాలకులు ఎవరు.?