నవరాత్రి మూడవ రోజున గణనాథుడిని ఏ పేరుతో పూజిస్తారు .?
08 September 2024
Battula Prudvi
దేశవ్యాప్తంగా గణపయ్య నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతి ఊరిలో, ప్రతి వీధిలో గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు.
ఈ ఉత్సవాల్లో భాగంగా గణేశుడు మొదటిరోజు అంటే భాద్రపద శుద్ధ చవితి నాడు 'వరసిద్ధి వినాయకుడు'గా పూజలు అందుకున్నాడు.
రెండవ రోజు విఘ్నేశ్వరుడిని 'వికట వినాయకుడు'గా తమ శక్తికి తగ్గట్టు పూజించి అటుకులను నైవేద్యంగా సమర్పించారు.
మరి మూడవ రోజు గణపతిని ఈ పేరుతో పూజిస్తారు. పూజను ఎలా చేస్తారు .? ఏమి వినియోగించాలి అన్నది ఈరోజు తెలుసుకుందాం.
నవరాత్రి వేడుకల్లో మూడో రోజు అంటే భాధ్రపద శుద్ధ షష్ఠి నాడు ఆ గణపతిని 'లంబోదర వినాయకుడు' అని పిలుస్తారు.
క్రోధాసురుడిని వధించిన లంబోదరుడిని మూడో రోజు షోడశోపచారాలతోనూ, అష్టోత్తర శతనామావళితో గానీ, సహస్ర నామావళితోనూ పూజించాలి.
హిందూ నమ్మకం ప్రకారం భక్తులు క్రోధాన్ని విడిచిపెట్టడం కర్తవ్యంగా ఈనాటి పూజని భక్తి శ్రద్దలతో నిర్వహిస్తారు.
ఈ రోజున గణేశునికి మామూలు పేలాలు కాకుండా.. పేలాల పిండి తయారు చేసి స్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి