ఆర్దిక స్థితి మెరుగు పడాలా.. తులసి మొక్కకు రోజూ దీనిని నైవేద్యంగా పెట్టండి..
24 December 2024
Pic credit -Getty
TV9 Telugu
ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆనందం, శ్రేయస్సు కోరుకుంటాడు. ఎప్పుడూ డబ్బులకు ఇబ్బంది లేకుండా జీవించాలని ఆర్ధిక సంక్షోభం రావద్దని కోరుకుంటాడు.
అయితే కొంత మంది నిత్యం ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా శ్రమిస్తున్నప్పటికీ తమ కనీస అవసరాలు చాలా తీర్చుకునే వీలుండదు.
ఎంత సంపాదించినా డబ్బు ఆదా చేయలేని వారు చాలా మంది ఉన్నారు. మీరు కూడా ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే తులసి మొక్కని ఇలా పూజించండి
తులసి మొక్కకు కొన్ని పదార్ధాలను నైవేద్యంగా సమర్పిస్తే ఎవరికైనా డబ్బుకి ఇబ్బంది ఉండదు. పురాణ గ్రంధాల ప్రకారం, తులసి లక్ష్మీ దేవి నివాసంగా నమ్ముతారు.
లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తులసి పూజ చేస్తారు. తులసి మొక్కకు నీరు పెట్టడం శుభప్రదంగా పరిగణించబడుతుంది
సాయంత్రం సమయంలో తులసి ముందు దీపాన్ని కూడా వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని చాలామంది నమ్ముతారు. ఇలా చేసిన వ్యక్తిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది.
జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం లక్ష్మీదేవికి తెల్లని వస్తువులంటే ఇష్టం. కనుక తులసి మొక్కకు నీళ్ళు పోయడమే కాదు పచ్చి పాలను నైవేద్యంగా పెట్టడం వలన లక్ష్మీదేవి సంతృప్తి చెందింది.
పచ్చి పాలను తులసి మొక్కకు పెట్టిన ఇంటిలో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తవు. ఆర్థికంగా మెరుగుపడతారు. దాంపత్య సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంటిలో శాంతి నెలకొంటుంది.