01 September 2023

తిరుమల వెంకన్నకు రికార్డ్ రేంజ్ హుండీ ఆదాయం

తిరుమల తిరుపతి దేవస్థానం రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. టీటీడీకి ఆగస్టులో రూ.120 కోట్ల హుండీ వసూళ్లు వచ్చాయి.

ఆగస్టులో22.25 లక్షల మంది భక్తులు కొండపైకి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

ఆగష్టు ఒక్క నెలలోనే కోటి 9 లక్షల లడ్డూ ప్రసాదాలను అమ్మినట్లు టీటీడీ అధికారులు మీడియా ముఖంగా వెల్లడించారు.

ఆగస్టు ఒక్కనెలలోనే 43.07 లక్షలమంది భక్తులకు అన్నప్రసాదం అందిచినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

9.07 లక్షలమంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి , మొక్కులు చెల్లించారని టీటీడీ వెల్లడించింది.

అయితే గత సంవత్సరం మార్చి నుంచి ఈ ఆగస్టు వరకు తిరుమల వెంకన్న హుండీ ఆదాయం.. ప్రతి నెలా రూ.100 కోట్లకుపైగా వస్తుంది.

కాగా సెప్టెంబర్‌ 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనుంది టీటీడీ.  

18న ధ్వజారోహణం సందర్భంగా సీఎం జగన్ రాష్ట్రప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.