ఈ గుడిలో స్తంభం విరిగితే కలియుగం అంతం! శివాలయంలో అన్నీ రహస్యాలే 

30 January 2024

TV9 Telugu

చూపరులను ఆకట్టుకునే అద్భుతమైన కట్టడం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో ఉన్న కేదారేశ్వరాలయం. హరిచంద్ర కోటలో ఉన్న ఈ ఆలయం ఏళ్ల తరబడి భక్తుల విశ్వాస కేంద్రంగా ఉంది.

కేదారేశ్వర దేవాలయం

కేదారేశ్వర్ ఆలయం ఒక స్తంభం మద్దతుపైనే నిలబడి ఉంది. మిగిలిన మూడు స్తంభాలు గాలిలో ఊగుతూ  కనిపిస్తాయి.

ఒక స్తంభంపై నిలిచిన ఆలయం 

ఈ మందిరం కింద నాలుగు స్థంభాలపై శివయ్య కోసం గుడిని నిర్మించారు. ఖచ్చితంగా ఎప్పుడు నిర్మించారో తెలియదు.. కానీ కొందరు 5వేల ఏళ్ల  నాటిదని చెబుతారు. 

5000 ఏళ్ల నాటి ఆలయం 

ఈ ఆలయంలో నాలుగు స్తంభాలు 4 యుగాలికి సంకేతాలుగా భావిస్తారు. సత్యయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగము, కలియుగాలకి గుర్తులుగా భావిస్తారు భక్తులు

4 స్తంభాలు 4 యుగాలు

ఈ ఆలయంలో ఉన్న ఒకొక్క స్థంభం విరిగితే ఒక్కో యుగంతమట. ఇప్పుడు ఆలయం ఉన్నఒక్క స్తంభం విరిగిపోతే కలియుగం అంతం అవుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం.

ఒక్క స్థంభం విరిగితే 

ఆలయ రహస్యాలు నేటికీ వెల్లడి కాలేదు. గుహలో శివలింగం.. వర్షాకాలంలో నీటితో నిండిన తరువాత పైకి వస్తుంది. నీరు ఎండిపోతే శివలింగం తిరిగి తన స్థానానికి చేరుకుంటుంది.

గుహలో శివలింగం

ఈ ఆలయంలో ఉన్న మరో గొప్ప విషయం ఏమిటంటే.. వేసవి కాలంలో గుహలోని నీరు చల్లగా ఉంటుంది.  అయితే శీతాకాలంలో నీరు వేడిగా ఉంటుంది.

శీతాకాలంలో వేడి నీరు