దీపావళి నాడు వెలిగించే దీపాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టే ఏటా ఎన్నో దీపాలు సరికొత్తగా ముస్తాబై మరీ మార్కెట్లో కొలువుదీరుతున్నాయి.
ఈ పండుగకు కొన్నయినా మట్టి దీపాలు పెట్టడం సంప్రదాయం. మట్టి దియాల్లో నూనె పోసి, వెలిగించేవి కొన్నయితే, ఆ శ్రమ లేకుండా మైనాన్నే నింపుకుని వస్తున్నవి మరికొన్ని.
మైనం వాసన కొందరికి పడదు. అలాగని నూనె పోసి వెలిగించే తీరికా ఉండదు. అలాంటి వాళ్లను సోయా వ్యాక్స్ నింపి వాటిని పూలతో అలంకరించిన దీపాలు ఆకట్టుకుంటున్నాయి.
ఇవి నెమ్మదిగా కాలతాయి కాబట్టి చాలాసేపు వెలుగుతుంటాయి. మైనం కరుగుతున్నా వాటిమీద ఉన్న డిజైన్ అలాగే ఉంటుంది కాబట్టి చూడ్డానికీ అందంగా ఉంటాయి.