ఆధ్యాత్మిక అద్భుతం అయోధ్య రామ మందిరం.. ఆసక్తికరమైన విషయాలు 

21 January 2024

TV9 Telugu

అయోధ్యలోని స్మారక రామ మందిరంలో కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విగ్రహం ఉంటుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు.

గర్భ గుడిలో ప్రతిష్టించే బాల రాముడి విగ్రహం కోసం మూడు రెడీ చేయగా వాటిలో ఒకదానిని అయోధ్యలోని ఆలయ ట్రస్ట్ ఇటీవల ఖరారు చేసింది.

హనుమంతుని జన్మస్థలంగా విశ్వసిస్తున్న కిష్కింద ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన శిల్పి  రామాలయంలోని గర్భ గుడిలో కొలువు దీరే విగ్రహాన్ని రూపొందించడం గర్వకారణం.

జోషి ఎంపిక తర్వత ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వెల్లడించారు.  దీనిని "రామ-హనుమంతుల అవినాభావ సంబంధానికి ఉదాహరణ"గా పేర్కొన్నారు.

యోగిరాజ్ తల్లి సరస్వతి సంతోషం వ్యక్తం చేస్తూ ప్రతిష్టాపన కోసం తన కుమారుడి చెక్కిన శిల్పాన్ని ఎంపిక చేయడం తనకు అత్యంత సంతోషకరమైన క్షణమని పేర్కొంది.

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామ మందిర నిర్మాణాన్ని నిర్వహిస్తుంది. విగ్రహం కోసం ముగ్గురు శిల్పుల డిజైన్లను పరిశీలించారు.

ఎంపిక చేసిన విగ్రహం 51-అంగుళాల ఎత్తులో ఐదేళ్ల వయసున్న 'బాల రాముని దివ్య రూపం.. ప్రత్యేక ముద్ర ఆధారంగా ఎంపిక చేయబడింది.

ఈవెంట్ కోసం సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వేలాది మంది ప్రముఖులు, వివిధ వర్గాల ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది.

యోగిరాజ్ అరుణ్ ప్రసిద్ధ శిల్పుల కుటుంబం నుండి వచ్చారు. తాత బసవన్న శిల్పి.. మైసూర్ రాజుల ఆస్థానంలో పనిచేశారు.