07 October 2023
కలలో పాములు కనిపించడం శుభం.. ముఖ్యంగా పాములు సృజనాత్మకత శక్తి అధికంగా ఉన్న వారికే కనిపిస్తాయని సర్పశాస్త్రం చెబుతోంది.
పాము కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో ఏమో అని అందరూ భయపడుతుంటారు. ఈ రోజు పాములు స్వప్నంలో కనిపిస్తే ఏ ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం
కలలో పట్టుకున్న పాము కనిపించినా లేదా బిలంలోకి వెళ్తున్నట్లు కనిపించినా ఆ వ్యక్తికి భవిష్యత్తులో అకస్మాత్తుగా ఆర్ధిక లాభం కలుగుతుంది.
కలలో పాము మిమ్మల్ని వెంటాడితే సమస్యలు, కష్టాలు తప్పవు. సమస్యలు ఎదురైనా ఎదుర్కోవడానికి రెడీగా ఉండమని సూచన
అదే పాము మిమ్మల్ని వరస వరసగా రెండుసార్లు కాటు వేస్తే అది ప్రతికూలతకు సూచన
కలలో ఒక పాము కోరలను చూస్తే మీ అంతర్గత జ్ఞానం, స్వీయ శక్తిని మీకు తెలియజేయడానికి ప్రతీక
కలలో కనిపించిన పాము ఏమీ చేయకుండా మెల్లగా వెళ్లిపోతే ఆ వ్యక్తి సుఖ సంతోషాలతో ఉంటాడు.
కలలో పాము కనిపించి అది కాటు వేసి వెళ్ళిపోతే.. మీ జీవితంలో ఎలాంటి సమస్య ఉండదని స్వప్న శాస్త్రం చెబుతోంది.