మంత్రాలయానికి రికార్డు స్థాయి ఆదాయం..

మంత్రాలయానికి రికార్డు స్థాయి ఆదాయం..

image

TV9 Telugu

31 January 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూల్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం. ఇక్కడ రాఘవేంద్ర స్వామిని పూజిస్తారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూల్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం. ఇక్కడ రాఘవేంద్ర స్వామిని పూజిస్తారు.

ఈ పుణ్యక్షేత్రం కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఏటా వెలది మంది భక్తులు రాఘవేంద్ర స్వామి దర్శనానికి వస్తుంటారు.

ఈ పుణ్యక్షేత్రం కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఏటా వెలది మంది భక్తులు రాఘవేంద్ర స్వామి దర్శనానికి వస్తుంటారు.

ఈ క్షేత్రం 17వ శతాబ్దంలో కర్నూల్ ప్రాంతంలో నివసించిన సాధువు రాఘవేంద్ర తీర్థ సమాధిగా ప్రసిద్ధి చెందింది.

ఈ క్షేత్రం 17వ శతాబ్దంలో కర్నూల్ ప్రాంతంలో నివసించిన సాధువు రాఘవేంద్ర తీర్థ సమాధిగా ప్రసిద్ధి చెందింది.

అతను ఆలయ స్థలంలో తన శిష్యుల ముందు ధ్యాన స్థితిలో సజీవంగా ప్రతిష్టించబడ్డాడని ఇక్కడ ప్రజలు నమ్ముతారు.

తుంగభద్ర నది ఒడ్డున ఉన్న రాఘవేంద్ర మఠం, దేవాలయాలకు వేలాది మంది వస్తుంటారు. అలాగే ఇక్కడ కానుకలు కూడా సమర్పించుకుంటారు.

ఇదిలా ఉంటె తాజాగా భక్తులు బహుకరించిన కానుకలతో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరినట్లు తెలిపారు అధికారులు.

శ్రీ రాఘవేంద్రస్వామి హుండీ ఆదాయం 33 రోజుల్లో రూ. 4,15,32,738గా ఉంది. అలాగే బంగారం 44 గ్రాములు, వెండి 3642 గ్రాములు వచ్చినట్లు తెలిపారు.

కర్నూల్ మంత్రాలయం క్షేత్రంలో ఆదాయం గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా పెరిగిందని వివరించిన శ్రీ మఠం అధికారులు.