1100 ఏళ్ల పురాతన లక్ష్మీదేవి ఆలయం.. రోజుకు 3సార్లు రంగు మార్చుకునే అమ్మవారు

20 September 2024

TV9 Telugu

Pic credit -  Socialmedia

భారతదేశంలో అనేక అలయాలున్నారు. దేవుళ్ళతో పాటు దేవతల ఆలయాలు ప్రసిద్ధి చెందాయి. అలాంటి వాటిలో ఒకటి లక్ష్మీదేవి ఆలయం. 

ప్రసిద్ధిగాంచిన ఆలయం 

ఈ లక్ష్మీదేవి ఆలయ ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడి అమ్మవారి విగ్రహం రంగు రోజుకు మూడుసార్లు మారుతుంది. 7 శుక్రవారాలు అమ్మవారిని పూజించడం చాలా ఫలవంతంగా భావిస్తారు.

రంగు మారే విగ్రహం 

ఈ విశిష్టమైన ఆలయం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఉంది. లక్ష్మీదేవి ప్రధాన దైవంగా పూజలను అందుకుంటున్న ఈ ఆలయం పేరు పచ్చమఠ దేవాలయం. 

పచ్చమఠ దేవాలయం

చరిత్ర సుమారు 1100 సంవత్సరాల నాటిదని, ఇది గోండ్వానా పాలనలోని రాణి దుర్గావతకు సంబంధించినదని చెబుతారు.

1100 ఏళ్ల చరిత్ర

క్వీన్స్ దివాన్ ఆధార్ సింగ్ పేరు మీద ఉన్న అధర్తల్ చెరువులో ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయం లక్ష్మీదేవికి అంకితం చేసినా ఇతర దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి.

అధర్తల్ చెరువులో

'ఈ ఆలయం తంత్ర సాధనకు ప్రసిద్ధి చెందింది. అయితే లక్ష్మీ దేవి విగ్రహం రంగులు మారడంతో ఇది విశిష్ట దేవాలయాల జాబితాలో చేర్చబడింది.

తంత్ర సాధనకు ప్రసిద్ధి

విగ్రహం రంగు ఉదయం తెల్లగా, మధ్యాహ్నం పసుపు , సాయంత్రం నీలం రంగులోకి మారుతుంది. ఈ అద్భుతాన్ని చాలా తక్కువ మంది మాత్రమే చూడగలరు

ఏ సమయంలో ఏ రంగు అంటే 

సూర్యకిరణాలు ఆలయంలోని అమ్మవారి పాదాలపై పడతాయి. సూర్య భగవానుడు లక్ష్మీదేవికి ఈ విధంగా నమస్కరిస్తున్నాడని నమ్మకం.

 సూర్యభగవానుడు