తండ్రికే ప్రణవ మంత్రము అర్దాన్ని చెప్పి జ్ఞానబోధ చేసిన కుమారునిగా సుబ్రమణ్యస్వామి అన్ని దైవాల్లో తనకున్న ప్రత్యేకతను చాటుకున్నాడు
ఆరు ముఖాలతో కూడిన స్వామిగా నిత్యం భక్తుల చేత పూజలందుకునే సుబ్రమణ్యేశ్వరునికి తమిళనాడులోనే అధికంగా ఆలయాలు ఉండడం విశేషం.
పిలిస్తే పలికే దైవం.. ఎలాంటి కష్టాలనైనా తీర్చే దైవంగా సుబ్రహ్మణ్యేశ్వ స్వామిని పూజిస్తారు
సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్బరూపుడు కావడంవల్ల సుబ్రహ్మణ్య ఆరాధన, పూజ సర్వ శుభాలనిచ్చి, రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా విశ్వసిస్తారు
జాతకంలో కాలసర్ప దోషం, రాహు, కేతు దోషాలున్నా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం శ్రేయస్కరమని విశ్వాసం
సంతాన ప్రాప్తికోసం స్త్రీలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య, కేతు మంత్రాలతో 21మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను తాగితే వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం
మంగళవారం, శుద్ద షష్టి, మృగళిర, చిత్త, ధనిష్ట ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజునికి, సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతికరం. కుజ దోష నివారణకు ఈరోజుల్లో చేసే పూజలు అత్యంత ఫలవంతం అని నమ్మకం.
సుబ్రమణ్యస్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని..పెళ్లికాని వారికి వివాహం జరిగి సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం