01 February 2024
TV9 Telugu
శతాబ్దాల నాటి సాంస్కృతిక వారసత్వం భారత దేశం సొంతం.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ జనాభాకు నిలయం భారతదేశం.
నేపాల్ లో కూడా హిందూ మతం ప్రధాన మతంగా ఉంది. ఈ దేశంలో 90 శాతం మంది హిందువులే.. దీంతో ఇక్కడ హిందువుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది.
అఖండ భారత దేశం నుంచి విడిపోయి ఏర్పడిన మన పొరుగు దేశం బంగ్లాదేశ్ లో కూడా హిందువులు గణనీయ సంఖ్యలో ఉన్నారు. దేశ వైవిధ్యాన్ని సుసంపన్నం చేస్తూ ఈ దేశంలో గణనీయమైన హిందూ సమాజం నివసిస్తుంది
ఇండోనేషియా లోని ఆరు అధికారిక మతాలలో హిందూ మతం ఒకటి. ముఖ్యంగా బాలిలో ఎక్కువగా హిందువులు జీవిస్తారు. ఇక్కడ హిందువుల సాంస్కృతిక సంప్రదాయం కనువిందు చేస్తుంది
భారత దేశం నుంచి విడిపోయి ఏర్పడిన పాకిస్తాన్‌లో కూడా హిందువులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ మైనారిటీలైన హిందువులు ఆ దేశం సాంస్కృతిక సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తున్నారు.
రామాయణంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన శ్రీలంకలో కూడా చెప్పుకోదగిన సంఖ్యలో హిందువులున్నారు. ముఖ్యంగా ఉత్తర ,తూర్పు ప్రావిన్సుల వంటి ప్రాంతాలలో హిందూ మతాన్ని స్వీకరించిన జనాభా అధికం.
మారిషస్‌లో హిందూమతం గణనీయమైన ఉనికిని కలిగి ఉంది. ఆఫ్రికాలో హిందూమతం అత్యధికంగా ఆచరించే దేశం మారిషస్
ట్రినిడాడ్ మరియు టొబాగోలో హిందూ మతం రెండవ అతిపెద్ద మతం. ఇక్కడ విభిన్న మతపరమైన ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తూ ఉంటాయి.
గయానా గణనీయమైన హిందూ జనాభాను కలిగి ఉంది. ఇక్కడ హిందూ మతమే ఈ దేశం సాంస్కృతిక గొప్పతనాన్ని హైలైట్ చేస్తుంది