అంత్యక్రియలలో కుండలో నీళ్లు పోసి రంధ్రాలు ఎందుకు పెడతారో తెలుసా..?

03 December 2023

శరీరం, ఆత్మరెండు వేరు వేరు, కలియుగ ధర్మం ప్రకారం, మనిషి జీవితకాలం 120 ఏళ్లు.

కానీ ఈ రోజుల్లో అది 60కి చేరిపోయింది. 

శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు కూడా ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయాక ఆత్మ అందులో ఉండలేదు.

ఎందుకు అలా జరుగుతుందంటే ఆత్మ చెప్పినట్లు శరీరం వినే పరిస్థితిలో లేదు కాబట్టి..

ఎప్పుడైతే మనిషి చనిపోతాడో శరీరం నుండి అన్నీకూడా వేరైపోతాయి.

శరీరాన్ని దహనం చేసే దాకా మళ్లీ వాళ్ళతో కలిసి ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది.

శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి ఓ రంధ్రము పెట్టి, దాని నుండి నీరు ఎలా అయితే వెళ్ళిపోతుందో...

శరీరం నుండి అత్మ అలాగే వెళ్ళిపోయింది అని చెప్పినట్టు.. కుండని పగలకొట్టేసి ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాము..

ఇక నీకు ఈ శరీరం ఉండదు. నువ్వు వెళ్ళిపో అని చెప్పినట్టు దాంతో  ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతుందని అర్ధం.