నవరాత్రుల్లో గణపతిని ఏ రోజున ఏ రూపంలో పూజిస్తారంటే.? 

10 September 2024

Battula Prudvi 

మొదటి రోజున అంటే భాద్రపద శుద్ధ చవితినాడు 'వరసిద్ధి గణపతి'గా పూజలు అందుకుంటాడు గణేశుడు. ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు.

తర్వాత రెండవ రోజున గణనాథుడిని 'వికట గణపతి'గా పూజించి అటుకులతో చేసిన ఏదైన వంటకాలను ప్రసాదంగా సమర్పిస్తారు.

మూడవ రోజు విషయానికి వస్తే వినాయకుడిని 'లంబోధరుడి'గా పూజలు నిర్వహించి పేలాలతో చేసిన పిండిని నైవేద్యంగా పెడతారు.

నాలుగవ రోజు 'గజానన' రూపంలో పూజలు చేసి చెరుకును నైవేద్యంగా పెడితే, సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం.

ఐదవ రోజున 'మహోదర' రూపంలో గణపతిని కొలిచి కొబ్బరిని నివేదనగా సమర్పిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని అంటున్నారు.

ఆరవ రోజు 'ఏకదంతా' రూపంలో పూజ చేసి నువ్వులను నైవేద్యంగా సమర్పిస్తే ఆత్మస్థైర్యం ప్రసాదిస్తాడు విఘ్నధిపతి.

ఏడవ రోజున 'వక్రతుండ' రూపంలో పూజించి అరటి పండ్లను నైవేద్యంగా పెడితే ఉద్యోగాలు రావడమే కాకుండా ఆర్థికంగా బలపడతారు.

ఎనిమిదవ రోజున 'విజ్ఞరాజ' రూపంలో దర్శనమిస్తాడు గణపతి. సత్తుపిండిని నైవేద్యంగా పెడితే సిరిసంపదలు కలుగుతాయి.

తొమ్మిదవ రోజున స్వామివారిని 'ధూమ్ర వర్ణుడి' రూపంలో పూజించి, నేతి అప్పాలను నివేదనగా ఇస్తే ఏ పని చేసిన ఫలితాలు ఉంటాయి.

ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా నైవేద్యాలు సమర్పించిన వారు కోరిక కోర్కెలు తీరుస్తాడు గణాధిపతి వినాయకుడు.