ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం.. ఈసారి సెలవులు 4 రోజులు..

15 September 2024

Battula Prudvi 

ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి ఉత్సవాల హడావిడి భాగ్యనగరంలో గణపతులతో అంగరంగ వైభవంగా మొదలైంది.

ముఖ్యంగా గణేష్ నవరాత్రుల్లో ఖైరతాబాద్ గణేశ్ విగ్రహా నిమజ్జన వేడుకలకు లక్షలాది మంది భక్తులు రావడంతో నగరమంతా సందడి వాతావరణంనెలకుంటుంది.

సెప్టెంబర్ 17వ తేదీన అంటే 11వ రోజు అందులోనూ అంత చతుర్దశి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నారు.

కాగా ఈ సారి ఖైరతాబాద్‎లో 70 అడుగుల ఎత్తుతో సప్తముఖ మహాగణపతి విగ్రహాన్ని ప్రతిష్టించింది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ.

ప్రతి ఏడాది ఈ గణపతి నిమజ్జనం రోజున జంటనగరాల్లో ప్రభుత్వం సెలవు ప్రకటిస్తుంది. ఈ సారి కూడా అలానే ఉంటుంది.

ఇదిలా ఉంటె సెప్టెంబర్ 17న నిమజ్జనం ఉండటంతో జంటనగరాల్లో విద్యార్థులకు వరుసగా 4 రోజులు సెలవులు వచ్చాయి.

ఈ ఏడాది సెప్టెంబర్ 14న రెండో శనివారం కావడంతో ఆ రోజు పాఠశాలలకు యధావిధిగా సెలవు ఉంటుంది. మరుసటిరోజు ఆదివారం సెలవు.

మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సోమవారం అంటే సెప్టెంబర్ 16న పాఠశాలలకు సెలవు. 17న నిమజ్జన సెలవు ఉంటుంది. ఇలా వరుసగా 4 రోజులు సెలవులు.