ఈ ఆలయంలో పెళ్లయిన మగాళ్లకు నో ఎంట్రీ.. 

24 November 2023

 బ్రహ్మకు దేవాలయాలు అతి తక్కువ. దేశంలోని అరుదైన బ్రహ్మ ఆలయాల్లో ఒకటి. రాజస్థాన్‌లోని పుష్కర్‌లో బ్రహ్మ దేవాలయం.

బ్రహ్మ దేవాలయం

విష్ణువు, శివుడు, బ్రాహ్మలు త్రిమూర్తులు అంటారు. శివుడు విష్ణువులకు వేల సంఖ్యలో ఆలయాలు ఉన్నాయి.  కానీ బ్రహ్మకు మాత్రం కొన్ని మాత్రమే ఉన్నాయి. 

త్రిమూర్తులు

ఈ నగరానికి రూపకర్త బ్రహ్మదేవుడని నమ్మకం. విష్ణుమూర్తి దర్శనం కోసం బ్రహ్మదేవుడు ఇక్కడ 60,000 ఏళ్లు యజ్ఞం చేశాడని ప్రతీతి.

విష్ణుమూర్తి దర్శనం

ఈ ఆలయం 14వ శతాబ్దానికి చెందినది అయినప్పటికీ.. ఇది సుమారు రెండు వేల సంవత్సరాల పురాతనమైనదిగా భావిస్తున్నారు.

పురాతన ఆలయం 

బ్రహ్మదేవుడు ప్రధాన దైవంగా పూజింపబడే ఆలయంలో బ్రహ్మదేవుడి సంపూర్ణ ఆకారం ప్రతిష్ఠించబడింది. ఈ ఆలయాన్ని అమృత శిలతో నిర్మించారు.

అమృత శిలే

బ్రహ్మ గాయత్రి దేవిని పెళ్లాడంతో సరస్వతీ దేవి పెళ్లయిన పురుషులు గర్భాలయంలోకి ప్రవేశిస్తే కష్టాలు తప్పవని శపించిందట.  అందుకే ఈ ఆలయంలోకి పురుషులు వెళ్లరు

పెళ్లైన మగాళ్లకు నో ఎంట్రీ

పుష్కర్ లో 52  స్నాన ఘాట్లు ఉన్నాయి. పుష్కర్‌లో ఏటా జరిగే ఒంటెల జాతర ప్రపంచ ప్రసిద్ధి పొందింది

ఒంటెల జాతర 

గాయత్రీ, సరస్వతీ దేవేరులతో నాలుగు ముఖాలతో గల బ్రహ్మ దేవుడిని చూడటానికి రెండూ కళ్లు చాలవు. సన్యాసులే పూజాదికార్యక్రమాలను నిర్వహిస్తారు.  

గాయత్రీ, సరస్వతీ

ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున బ్రహ్మదేవునికి మహా ఉత్సవం జరుగుతుంది. ఆలయానికి సమీపంలో హంస వాహనం, గర్భ గుడి ఎదురుగా వెండి తాబేలు ఉంది.

బ్రహ్మోత్సవం