ఈ ఆలయంలో 900 సంవత్సరాల నాటి దివ్య దేహానికి పూజలు 

11 May 2024

TV9 Telugu

Pic credit - Pexels

సనాతన ధర్మం వైష్ణవ సంస్కృతికి చెందిన జగద్గురు రామానుజాచార్యుల దివ్య దేహం తమిళనాడులోని శ్రీ రంగంలో ఉన్న రంగనాథ స్వామి ఆలయంలో ఉంచబడింది. 

ఆలయంలో దివ్య దేహానికి పూజలు

శ్రీ రామానుజాచార్యులు వృద్ధాప్యంలో ఈ ఆలయానికి వచ్చారు. తన జీవితాంతం ఇక్కడే ఉన్నారు. 120 సంవత్సరాల వయస్సు వరకు ఈ ఆలయంలో పూజలు, ధ్యానం చేస్తూ ప్రజలకు ఉపదేశాన్ని కొనసాగించారు

ఆలయంలో 120 ఏళ్లు  

రామానుజాచార్యుల శరీరాన్ని కూడా ఈ ఆలయంలో ఆచారాలతో పూజిస్తారు. ఆయన మృత దేహం పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చుని ఉంటుంది. 

ఆలయంలో పూజలు 

ప్రతి ఏటారామానుజాచార్య శరీరంపై  రెండు సార్లు ఓ ఉత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో కర్పూరం, కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామానుజుల శరీరానికి పూస్తారు.

రెండు సార్లు ఓ ఉత్సవం

ఈ ఆలయం తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని శ్రీరంగం అనే ప్రదేశంలో ఉంది. ఇది గోదావరి, కావేరి వంటి పవిత్ర నదుల మధ్య నిర్మించబడింది. 

ఆలయం ఎక్కడ నిర్మించబడింది

రావణుడి సంహారం అనంతరం శ్రీరాముడు ఈ ఆలయంలో పూజలు చేసాడు. విష్ణువు దర్శనమిచ్చాడు. అందుకే ఇక్కడ చాలా అందమైన విష్ణుమూర్తి విగ్రహం ఉంది. 

ఆలయ విశ్వాసం ఏమిటి?

156 ఎకరాల విశాలమైన స్థలంలో రంగనాథ్ స్వామి ఆలయం. ఈ ఆలయం లోపల ఒక నగరం నిర్మించబడింది. 21 గోపురాలు అంటే అందులో నిర్మించబడిన ద్వారాలు వాటి ప్రత్యేక శిల్పాలకు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందాయి. 

ఆలయం లోపల నగరం

ఏడు ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది శ్రీ రామానుజాచార్యుల వారి శరీరం.

ఎన్నో ప్రత్యేకతలు