సోదరీమణులకు అండగా ఇండియా పోస్ట్.. విదేశాల్లో సోదరులకు రాఖీ..
TV9 Telugu
14 August 2024
రక్షా బంధన్ సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతుంది. ఈ ఏడాది ఆగస్టు 19న రాఖీ పండగ జరుపుకోనున్నారు.
ఈ పండుగ సందర్భంగా విదేశాల్లో ఉన్న సోదరులకు రాఖీలు డెలివరీ చేసే బాధ్యతను సోదరీమణుల తరపున ఇండియా పోస్ట్ తీసుకుంది.
భారతీయ పోస్టల్ సంస్థ అందిస్తున్న ఈ సేవ అమూల్యమైన సోదర-సోదరి బంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
రవాణా చేసినప్పుడు మీరు పంపిన రాఖీ దెబ్బతినకుండా ఉండేలా పార్శిల్ ను బాగా ప్యాక్ చేయాలని తెలిపింది తపాలా శాఖ.
వర్షం లేదా తేమ నుండి రక్షించడానికి వాటర్ ప్రూఫ్ పరికరాలను ఉపయోగించండి. పోస్టాఫీస్ నుంచి వాటర్ ప్రూఫ్ కవర్లను కూడా కొనుగోలు చేయవచ్చు.
సరైన చిరునామా, పిన్ కోడ్, మొబైల్ నంబర్ రాయండి. అలాగే మీ పార్శిల్లోని ప్రతిదానికి స్పష్టమైన సమాచారం ఇస్తే కస్టమ్ క్లియరెన్స్ లలో ఎలాంటి సమస్య ఉండదు.
అంతేకాకుండా ప్రతిరోజూ రాత్రి వరకు ఇంటి నుంచే రాఖీల డెలివరీ, సేకరణకు ఇండియా పోస్ట్ ఏర్పాట్లు చేసింది.
ఇండియా పోస్ట్ తమ అంతర్జాతీయ మెయిల్ సేవను ఉపయోగించడం వల్ల మీ ప్రియమైనవారికి రాఖీలను పంపడం సులభం అంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి