వినాయకచవితి వేడుకలను దేశవ్యాప్తంగా అన్నిచోట్ల అంగరంగ వైభంగా పదిరోజులపాటు పండపం కట్టి అట పాటలతో జరుపుకొంటారు.
భాద్రపద శుద్ధ చవితి రోజున గణేశుడి జన్మదినం కారణంగా వినాయక చవితిని జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న జరగనుంది.
ఈరోజున అందరూ గణేశుని ఇంటికి తీసుకువచ్చి ఉండ్రాళ్లు, పండ్లను నైవేద్యంగా పెట్టి పత్రాలతో పూజలు చేస్తారు.
అయితే మీరు తెచ్చిన వినాయకుడి విగ్రహనికి కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి. తొండం దిశ కూడా చాలా ముఖ్యమైనది.
వాస్తు ప్రకారం, గణపతి ఎడమ వైపు తొండం ఎక్కువ పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. విగ్రహాన్ని కొన్నప్పుడు ఇలాంటిదే చూసుకోండి.
తొండం ఎడమవైపునకు తిరిగిన వినాయకుడి విగ్రహాలు ఓదార్పు శక్తి ప్రవాహానికి ప్రసిద్ధి చెందింది. అందుకే పూజకు శుభప్రదంగా భావిస్తారు.
కుడి తొండం ఉన్న గణేశ విగ్రహం బలమైనది, శక్తివంతమైనది. కానీ పూజకు పనికిరాదు. ఇవి సూర్య వాహినిని సూచిస్తుంది. అందువల్ల వీటిని పెట్టుకోవద్దని నిపుణుల సలహా.
గణపతి కుడివైపుకు తిరిగిన గణపతి చాలా మొండిగా ఉంటాడని, పూజలో చిన్న దోషాన్ని కూడా అంగీకరించడని పండితులు చెబుతున్నారు.