దేవుళ్లకు ఈ పువ్వులు సమర్పిస్తే.. ఇంట్లో దురదృష్ట తాండవం.. 

29 September 2025

Prudvi Battula 

హిందువులు అందరు ఇంట్లో పూజ గది ఏర్పాటు చేసుకొని భక్తితో రకరకాల పువ్వులు, దీపారాధనతో దేవుళ్లను పూజిస్తారు.

పువ్వులేని పూజను కనిపించడం చాలా అరుదు. ఇంట్లో అయినా.. గుడిలో అయినా.. హిందువుల చేసిన పూజకు పువ్వులు ఉండాల్సిందే.

కానీ జ్యోతిష్యం ప్రకారం కొన్ని రకాల పూజకు పనికిరావు. అలాంటి పువ్వులను దేవుళ్ళకు స‌మ‌ర్పిస్తే అశుభంగా భావిస్తారు.

మొగలి పువ్వుతో సృష్టి లయకారుడు శివుడికి పూజ చేయడం అరిష్టం. ఈ పువ్వుతో పూజ చేస్తే ముక్కంటికి కోపం వస్తుందని నమ్మకం.

గ‌న్నేరు పువ్వుల‌ను రామయ్యకి అర్పించడం మంచిది కాదు. దీనివల్ల భక్తులు కోరిన కోర్కెలు నెరవేరదాని జ్యోతిష్యం చెబుతుంది.

శ్రీ మహా విష్ణువును పూజిస్తే కొన్ని పువ్వులను దూరంగా పెట్టాలి. శ్రీనివాసునికి అగస్త్య పుష్పాలు సమర్పించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.

కింద పడిన పువ్వులు, ఘాటైన వాస‌న ఉన్న పువ్వులతో దుర్గాదేవికి పూజించడం అశుభం అంటున్నారు హిందూ పండితులు.

పార్వతి దేవి పూజకి జిల్లేడు, ఉమ్మెత్త పువ్వులను ఉపయోగించవద్దు. జగన్మాతకి ఈ పూలను సమర్పించడం మంచిది కాదు.

శివునికి ప్రీతికరమైన బిల్వ పత్రాన్ని సూర్య భగవానుడికి సమర్పించకూడదట. ఇలా చేస్తే భాస్కరునికి ఆగ్రహం కలుగుతుందని నమ్మకం.