శివరాత్రికి టూర్ ప్లాన్ ఉందా.? పంచారామాలు బెస్ట్.?
TV9 Telugu
24 February 2025
పంచారామాలు అంటే 5 శివాలయాలు. వీటిని ఒక్క రోజులో దర్శించుకుంటే శివుని కృప లభిస్తుంది. ఇవి ఆంధ్రలోని ఉభయ గోదావరి జిల్లాల్లో నాలుగు, పల్నాడు జిల్లాలో ఒకటి ఉన్నాయి.
ఈ పంచారామ యాత్రలో మొదటిగా దర్శించుకోవలసిన క్షేత్రం పల్నాడు జిల్లాలోని అమరావతి. ఇక్కడ అమర లింగేశ్వరస్వామి లింగాన్ని ఇంద్రుడు ప్రతిష్టించాడు.
తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో సోమేశ్వర స్వామిని దర్శించుకోవాలి. చంద్రుడు ప్రతిష్టించిన ఈ లింగం పున్నమికి తెల్లని రంగులో, అమావాస్యకి నల్లటి రంగులో దర్శనం ఇస్తుంది.
అక్కడ నుంచి పశ్చిమ గోదావరి పాలకొల్లుకి చేరుకొని శ్రీరాముడు ప్రతిష్టించిన క్షీరరామలింగేశ్వరస్వామిని దర్శించుకుంటారు.
ఆ తర్వాత మీరు దర్శించుకోవలసిన క్షేత్రం కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం. ఇక్కడి భీమేశ్వరస్వామి లింగాన్ని సూర్యుడు ప్రతిష్టించాడు.
ఇక్కడే దక్ష యజ్ఞం జరిగింది. ఈ క్షేత్రాన్ని దశకటపోవన, దశకవాటిక అని కూడా అంటారు. దీనికి గుర్తుగా ఇక్కడ మాణిక్యాంబ శక్తి పీఠం ఉంది.
చివరిగా కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో కుమార రామలింగేశ్వరస్వామిని దర్శనం చేసుకోవాలి. కామారస్వామి ఈ లింగాన్ని ప్రతిష్టించాడు.
వీటి దర్శనం కోసం మీ సొంత వాహనం ఉపయోగించవచ్చు. లేదంటే ఆర్టీసి, కొన్ని ప్రభుత్వ టూర్ ప్యాకేజీలు కూడా ఉన్నాయి.