ఇంట్లో మొక్కలు పెంచుతున్నారా.? ఈ సమస్యలు తప్పవు..

TV9 Telugu

29 October 2024

వాస్తు శాస్త్రంలో శక్తికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీని ప్రకారం ఇంట్లో ఉంచిన ప్రతిదీ ఇంట్లో నివసించే సభ్యులపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావం చూపుతుంది.

వాస్తు శాస్త్రంలో చింత చెట్టు చాలా అశుభకరంగా పరిగణిస్తారు. ఈ చెట్టు మీ ఇంట్లో ప్రతికూలతను తెస్తుంది.

చింత చెట్టు ఇంటి ప్రాంగణంలో ఉంటె.. ఇంట్లో వాతావరణం భయంకరంగా ఉంటుందని దేశంలో చాలామంది హిందువులు నమ్ముతారు.

వాస్తు శాస్త్రంలో రావి మొక్క ఇంట్లో ప్రతికూల శక్తిని తెస్తుంది. ఇంటి గోడలో లేదా ఏదైనా మూలలో రావి మొక్క పెరిగి ఉంటే, దానిని తొలగించండి.

ముళ్ల మొక్కలు ఇంటి లోపల ఎప్పుడూ పెంచుకోరాదు. వీటిని పెంచుకోవడం వలన ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరగడం మొదలవుతుంది.

ఇంట్లో నిమ్మకాయ మొక్కను ఉంచడం అశుభం. దీని వల్ల వాస్తు దోషాలు వస్తాయని దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు నమ్ముతారు.

దీన్ని ఇంట్లో ఉంచితే కుటుంబ సభ్యుల మధ్య టెన్షన్, ద్వేషం ఏర్పడుతుంది. మీరు ఇంట్లో నిమ్మ మొక్క పెంచుకుంటుంటే వెంటనే దానిని తొలగించండి.

ఇంట్లో ఎండిన మొక్కలు ఉంటే వాటిని తొలగించాలి. వాస్తు ప్రకారం, ఎండిన చెట్లు , మొక్కలు ఇంట్లో దుఃఖాన్ని తీసుకుని వస్తాయి. ప్రతికూలతను పెంచుతాయి.