రాఖీ పౌర్ణమి రోజు ఇలా చేస్తే.. మీపై లక్ష్మీ అనుగ్రహం ఉన్నట్టే..

01 August 2025

Prudvi Battula 

లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణ పౌర్ణమి రోజున రక్షా బంధన్ జరుపుకుంటారు. ఈ రాజు పరిహారాలు వల్ల నారాయణి అనుగ్రహం లభిస్తుంది.

రాఖీ పౌర్ణమి రోజు పిల్లలు తమ తల్లిదండ్రులు, గురువుల వద్ద ఆశీర్వాదం తీసుకోవాలి. దీనివల్ల లక్ష్మి కటాక్షం వస్తుంది.

ఇలా  చేయడం వల్ల చేసే పనిలో విజయం రావటమే కాదు మేధస్సు, బలం, సమాజంలో గౌరవం పెరుగుతాయని పేర్కొనబడింది.

అలాగే ఏవైనా క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు సులభంగా అధిగమించే సామర్థ్యాన్ని పొంది అసాధారణమైన ప్రతిభను కనబరుస్తారు.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రక్ష బంధన్ రోజు సోదర, సోదరీమణులు చంద్రుడు, నవ గ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి మంత్రాలను పఠించాలి.

దీంతో గ్రహ దోషాలు తొలగి ప్రతికూల ప్రభావల నుంచి ఉపశమనం లభిస్తుంది. అన్ని పనులు సకాలంలో పూర్తి అయిపోతాయి.

ఈ పర్వదినాన సోదర, సోదరీమణులందరూ మీ సామర్థ్యం మేరకు కొత్త డబ్బు లేదా ఆహారం పేదలకు దానం చేయాలని పండితులు అంటున్నారు.

రాఖి పూర్ణిమ రోజు దాన ధర్మాలు చేస్తే త్వరలోనే ధనవంతులయ్యే అయ్యే అవకాశలు ఉన్నాయని శాస్త్రాల్లో పేర్కొనబడింది.