మీరు ఈ పనులు చేసారంటే.. అన్ని శుభ శకునములే.. గ్రహబలం..

Prudvi Battula 

Images: Pinterest

16 November 2025

జాతకంలో సూర్యుడి స్థానం బలపడాలంటే ఆదివారం ఎరుపు బట్టలని ధరించి ఉపవాసం చేసి ఆదిత్యునికి అర్ఘ్యం సమర్పించాలి.

ఆదివారం ఎరుపు బట్టలు

కుజుడు బలంగా మారాలంటే మంగళవారం హనుమంతునికి ఎర్ర పువ్వులతో పూజ చేయాలి. హనుమాన్ చాలీసాను పాటించి ఉపవాసం ఆచరించాలి.

హనుమంతునికి ఎర్ర పువ్వులు

మీ జాతకంలో చంద్రుడి స్థానం బలంగా ఉండాలంటే సోమవారం ఉపవాసం చేసి పేదలకు పాలు, వెన్న వంటివి దానం చెయ్యాలి.

పేదలకు పాలు, వెన్న

మీ జాతకంలో గురువు బలహీనంగా ఉంటే గురువారం పసుపు రంగు బట్టల్ని ధరించి ఉపవాసం దీక్ష ఆచరించి పసుపు దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

గురువారం పసుపు బట్టలు

మీ జాతకంలో బుధుడి స్థానం బలహీనపడితే బుధవారం పచ్చని బట్టలను ధరించి వినాయకుడిని పూజించాలి. అలాగే తులసి మొక్కకి నీరు పోయండి.

బుధవారం పచ్చని బట్టలు

శని బలహీనంగా ఉన్న జాతకులు నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి. అలాగే హనుమంతుడికి పూజ చెయ్యాలి. శనివారం నల్ల నువ్వులు, నల్ల బట్టలను దానం చేయడం మంచిది.

నల్ల నువ్వులు, నల్ల బట్టలను దానం

జాతకంలో శుక్రుడు బలపడాలంటే శుక్రవారం తెల్ల బట్టలు వేసుకొని వెండి ఆభరణాలు ధరించి లక్ష్మీదేవిని భక్తితో ఆరాధించాలి.

శుక్రవారం తెల్ల బట్టలు

కేతువు బలహీనంగా ఉన్నవారు వినాయకుడిని భక్తితో పూజించాలి. అలాగే "ఓం కేతవే నమః" అంటూ జపించడం మంచిది. కుక్కలకు ఆహారం పెట్టాలి.

గణపతి పూజ