శ్రీరామబంటుగా చెప్పుకునే అంజనేయుడు శ్రీరాముడిని మంచి సేవకుడే కాదు, స్నేహితుడు కూడా.
సొంత అన్న కారణంగానే కష్టాల పాలైన సుగ్రీవుడు తనకు సాయం చేసిన శ్రీరాముడికి మంచి స్నేహితుడిగా కొనసాగాడు.
కఠిక పేదరికంలో ఉన్న తన కష్టాలను బాల్యమిత్రుడికి చెప్పుకుందామని వచ్చిన సుధాముడిని శ్రీకృష్ణుడు గుండెలకు హత్తుకున్నాడు. స్థాయి మారినా స్నేహబంధం అజరామరం అని నిరూపించాడు.
శ్రీకృష్ణుసొంత చెల్లెలికి సవతి అయిన ద్రౌపదిని శ్రీకృష్ణుడు ఏనాడూ అలా చూడలేదు. పైగా తన చెల్లెలు కంటే అమితంగా ద్రౌపదిని అభిమానించి ఆమె కష్టకాలంలో అండగా నిలిచాడు.డు- ద్రౌపది
మేనత్త కొడుకు, చెల్లెలి భర్త అయిన అర్జునుడితో శ్రీకృష్ణుడు గొప్ప గురువుగా, స్నేహితుడిగా మెలిగాడు.
లోకమంత తనను చిన్నచూపు చూసినప్పుడు, తనకు రాజ్యాభిషేకం చేసి రాజును చేసిన దుర్యోధనుడికి కర్ణుడు చివరి క్షణం వరకు కూడా స్నేహభావం, కృతజ్ఞతతోనే జీవించాడు. చేస్తున్నది అధర్మమని తెలిసినా స్నేహధర్మానికి ప్రాధాన్యమిచ్చాడు.