తెలుగు రాష్ట్రాల్లో భారీ గణపతులు వేరే..  

10 September 2024

Battula Prudvi 

విశాఖపట్నంలోని గాజువాక శ్రీనగర్‌లో SV ఎంటర్‌టైన్‌మెంట్స్ 89 అడుగులు ఉన్న గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.

లంబోధర ఛారిటబుల్ ట్రస్ట్ గాజువాక బస్ డిపో సమీపంలోని కొత్త నక్కవానిపాలెం వద్ద బెల్లం ముద్దలతో చేసిన 75 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్టించింది.

వైజాగ్‎లోని ఎమ్‎విపి కాలనీలో అయోధ్య టెంపుల్ సెట్ వేసి అందులో నీలమేఘశ్యామ రూపంలో గణేశుని ప్రతిష్టించారు.

విశాఖపట్నం దొండపర్తిలో 54 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు ఆ ప్రాంతవాసులు. ఇక్కడకి చాలామంది భక్తులు తరలివస్తున్నారు.

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లో 70 అడుగుల భారీ శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

హైదరాబాద్ నగరంలోని కొత్తపేట్‎లో 54 అడుగుల ఎత్తున్న కాలభైరవ ఉగ్రరూప మహా గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

ఈ ఏడాది బాలాపూర్ గణనాథుడి మండపాన్ని అయోధ్య ఆలయ నమూనాలో నిర్మించి గణపతిని ప్రతిష్టించారు. ఈసారి 21 కేజీల లడ్డు సమర్పించారు.

దిల్‌సుఖ్‌నగర్‌లోని సందడిగా ఉండే ప్రాంతంలో ఉన్న చైతన్యపురి గణేష్ పండల్ అందమైన అలంకరణలు, భారీ ఎత్తున వేడుకలకు ప్రసిద్ధి చెందింది.